మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: హరీష్ రావు

-

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.కేవలం సన్న వడ్లకే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాకు రూ.500ల బోనస్ ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల్లోనే అహంకారం నెత్తికెక్కింది.. ఈ అహంకారాన్ని దించాల్సి ఉంది!ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం..ఎన్నికల్లో మాటిచ్చినట్లుగా రైతులకు బోనస్ అమలు చేయకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం హరీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాట్లాడుతూ…

అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. పవర్‌లోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ.2 లక్షల మాఫీ అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని మండిపడ్డారు.ధాన్యానికి ఇస్తానన్న బోనస్ ఇప్పటికీ అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news