నర్సంపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రపంచంలోనే 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, పదేళ్ల మోదీ పాలనలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రతి గుడిసెవాసికి టాయిలెట్ నిర్మించాలనే ఆలోచన గత పాలకులకు ఎందుకు రాలేదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
ఉక్రెయిన్ యుద్ధం నుండి మనదేశ విద్యార్థులనే కాకుండా పక్క దేశాల పిల్లలను కూడా మన విమానాలలో జాగ్రత్తగా తీసుకొచ్చారు.టీచర్లు, ప్రభుత్వోద్యోగులు, అంగన్వాడీల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు విసిగిపోయి గద్దె దించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ప్రజలలో ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. ఇచ్చిన ఏ హామీలు ఇంతవరకూ అమలు చేయలేదు.దేశం ప్రశాంతంగా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ ప్రధాని మోదీయే ప్రధాని పదవిలోకి రావాలి. బీజేపీ బలపరిచిన మన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఓట్లు వేసి గెలిపించాలి అని ఈటల రాజేందర్ కోరారు.