‘ఇంపాక్ట్‌ ప్లేయర్’ రూల్‌ మార్పుపై ఐపీఎల్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

-

ఐపీఎల్‌లో బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్’ రూల్‌ ప్రకారం మ్యాచ్ జరుగుతుండగా అదనంగా బౌలర్‌ లేదా బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే.ఈ రూల్‌పై కొందరి నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా టీమిండియా సారధి రోహిత్ శర్మ ఇంపాక్ట్‌ రూల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్‌ రూల్ తనను ఆకట్టుకోలేదని, దీంతో ఆల్‌రౌండర్ల అభివృద్ధికి అడ్డంకిగా మారింద ని అన్నారు.ఈ క్రమంలో ఐపీఎల్‌ యజమాన్యం ఈ రూల్‌పై దృష్టి సారించింది.

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్ ఇంపాక్ట్‌ రూల్‌పై మాట్లాడుతూ… ‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లను గమనించాం. తప్పకుండా ఇంపాక్ట్‌ రూల్‌పై దృష్టిసారిస్తాం అని తెలిపారు. ఫ్రాంచైజీలు, కమిటీ సభ్యులతో చర్చించి.. ఓ నిర్ణయానికి వస్తాం అని అన్నారు. ఇంపాక్ట్‌ రూల్‌లో మార్పులు చేసేందుకు మేము సిద్ధమే. అయితే ఆటలో కొత్త నిబంధన తీసుకొచ్చినప్పుడు లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి’ అని పేర్కొన్నారు. 2022-23 సీజన్‌ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇంపాక్ట్‌ రూల్‌ను అమలు చేసిన బీసీసీఐ.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అన్ని జట్లు బాగా ఉపయోగిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news