తెలంగాణ ఉద్యమంలో తాము కష్టపడితే పేరు కేసీఆర్ కు వచ్చిందని మల్కాజిగిరి బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. 14 సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాడామని ,వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ప్రాణాలు పణంగా పెట్టి పేషంట్ల మధ్య తిరిగిన బిడ్డను నేను అని తెలిపారు. ఆదివారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అన్నారు. ఎవరు ఎటుపోతే నాకేంటి నేను ముఖ్యమంత్రి అయితే చాలు.. నా పార్టీ అధికారంలోకి వస్తే ఎలా చాలు అని రేవంత్ రెడ్డి అడ్డమైన ప్రకటనలు చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు 66 హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీకి నీతి జాతి లేదని మండిపడ్డారు . కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మల్కాజగిరికి ఏం చేస్తారో అడగాలనీ అన్నారు.రియల్ ఎస్టేట్ చేస్తే చేసుకోమనండి. ఈ రాజకీయాలు వారికి ఎందుకని ప్రశ్నించారు. ఎవరికి తలవంచకుండా ప్రజల బాగు ఎజెండాగా బ్రతుకుతున్నామని, మల్కాజిగిరి సంపూర్ణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని అన్నారు.