ఐపీఎల్ 2022లో భాగంగా నేడు డబుల్ దామాకా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగ తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య 28వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు దుమ్ములేపారు. పంజాబ్ 180 వరకు స్కోర్ చేస్తుందనుకున్న సమయంలో మ్యాచ్ స్వరుపాన్ని మార్చేశారు. చివరి రెండు ఓవర్లోనే 5 వికెట్లను కూల్చారు. సన్ రైజర్స్ జట్టు బలమైన బౌలర్స్ ఉన్న జట్టు అని మరోసారి నిరూపించారు. చివరిలో ఓవర్ లో ఉమ్రాన్ మాలిక్.. ఏకంగా 3 వికెట్లను దక్కించుకున్నాడు. ఒక్క రన్ అయ్యేలా చేశాడు.
దీంతో పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఓవర్ లో కనీసం ఒక్క పరుగును కూడా చేయలేకపోయింది. ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసి పంజాబ్ బ్యాట్స్ మెన్లను వణికించాడు. భూవనేశ్వర్.. 3 వికెట్లు పడగొట్టాడు. వీరి దాటికి చివరి నలుగురు బ్యాట్స్ మెన్లు.. (0) కే పరిమితం అయ్యారు. అలాగే నటరాజన్, జగదీశ్ సుచిత్ తలో ఒక్క వికెట్ తీశారు.
పంజాబ్.. నిర్ణిత 20 ఓవర్లలో 151 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ బ్యాట్స్ మెన్లు లివింగ్ స్టోన్ (60) మినహా అందరూ విఫలం అయ్యారు. కాగ ఇప్పటికే మూడు వరుస విజయాలతో జోరు మీద ఉన్న సన్ రైజర్స్ మరో విజయం సాధించాలంటే.. 152 పరుగులు చేయాల్సి ఉంది.