సన్‌రైజర్స్-నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఆటగాళ్లను మించి అందరి దృష్టినీ ఆకర్షించింది అంపైరే. ముందు ఆ వ్యక్తిని చూసి పురుషుల మ్యాచ్‌లో తొలిసారి మహిళా అంపైర్ బాధ్యతలు నిర్వర్తిస్తోందేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ అక్కడున్నది మహిళ కాదు.. పురుషుడే అని తర్వాత తెలిసింది. ఆ అంపైర్ పేరు.. పశ్చిమ్ పాఠక్.
ఐపీఎల్ సీజన్ 13 లీగ్ దశలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలింది. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ లో కూడా అభిమానుల కళ్లు మైదానంలోని ఆటగాళ్ల కంటే అంఫైర్ నే ఎక్కువగా ఫోకస్ ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా అంపైర్ మైదానంలో అడుగుపెట్టిందని అనుకున్నారంతా. అయితే అక్కడుకున్న మహిళ కాదు పురుషుడే అని తెలిసి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది.
మహిళా అంపైర్ గా అభిమానులు భ్రమపడిన అంపైర్ పైరు పశ్చిమ్ పాఠక్. అందరు అంపైర్లలా కాకుండా కాస్త విభిన్నంగా కనిపించాలని భావించాడో ఏమో గాని లాంగ్ హెయిర్ పెంచాడు. దీంతో మ్యాచ్ లో అంపైరింగ్ చేస్తుండగా జుట్టు భుజాలపైకి వాలి అచ్చం మహిళలా కనిపించాడు. దీంతో ఓ మహిళా అంపైర్ చేస్తున్నట్లు అనిపించింది. ప్రస్తుతం పాఠక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం మొదలుపెట్టాయి.