ఐపీఎల్: లారా సలహా ధోనీ తీసుకుంటాడా..?

0
158

2019వరల్డ్ కప్ తర్వాత ధోనీ, క్రికెట్ ఆడలేదు. ఈ నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూసింది ఐపీఎల్ లో ధోనీ ఆటకోసమే. అయితే అలా ఎదురుచూసిన వారందరికీ నిరాశే మిగిలిందని చెప్పక తప్పదు. ఐపీఎల్ 13వ సీజన్లో ధోనీ సరిగ్గా ఆడట్లేదు. ఉత్తమ ఫినిషర్ గా పేరుండే ధోనీ, మ్యాచ్ ఫినిష్ చేయడంలో తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ధోనీకి సలహా ఇస్తున్నాడు. మ్యాచ్ ఫినిషర్ గా ధోనీ స్థానంలో మరొకరిని దించాలని చెబుతున్నాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో ధోనీ కేవలం 11పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్ 10పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ బాగా ఆడతాడని అందరికీ తెలుసు. అదీగాక అతడు మంచి ఫినిషర్ కూడా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ ఫినిష్ చేసే బాధ్యత వేరే వాళ్లకి అప్పగించాలని లారా చెబుతున్నాడు. బ్యాటింగ్ లో జడేజా ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడని, అందువల్ల అతనికి అప్పగిస్తే బాగుంటుందని కోరుతున్నాడు. మరి లారా మాటలు ధోనీ వింటాడా లేదా చూడాలి.