ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కి చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ లో ప్రదేశాలని చూడడానికి ఒక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ లో వుండే ప్రదేశాలని చూడడానికి ఈ టూర్ ప్యాకేజీ బాగా ఉపయోగ పడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా రామోజీ ఫిలిం సిటీని కూడా చూడచ్చు. ‘హైదరాబాద్ టూర్ విత్ రామోజీ ఫిలిం సిటీ’ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తున్నారు. ఇక ఈ టూర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
ఈ టూర్ మొత్తం 1 రోజు, 2 రాత్రుల ప్యాకేజీ. ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, త్రీ స్టార్ హోటల్‌లో ఏసీ అకామడేషన్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివన్నీ ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. సైట్ సీయింగ్ ప్రాంతాల్లో ఎంట్రెన్స్ ఫీజు, టూర్ గైడ్ సర్వీసెస్, లంచ్ కవర్ వంటివి మీరే పెట్టుకోవాలి.
ఇక ధర గురించి చూస్తే… టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,845 మాత్రమే. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,135, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.9,750 చెల్లించాలి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఐఆర్‌సీటీసీ రిసీవ్ చేసుకుంటుంది.
ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూంబ్స్ ని మొదట రోజు చూడచ్చు. రెండో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్తారు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.