ఇండియా క్రూడ్ ఆయిల్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి- నితిన్ గడ్కరీ.

-

భారత దేశం పెట్రోలియం, డిజిల్ వంటి క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోలియం కారకాల వల్ల దేశంలో పెద్ద ఎత్తున కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. పెట్రోలియం దిగుమతుల వల్ల రూ.8 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇదే కొనసాగితే రానున్న ఐదేళ్లలో ఇది రూ. 25 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. దీంతో దేశం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ద్రుష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. దేశంలో రాబోయో కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ ఇంధనమైన ఇథనాల్ వంటి వాటిపై ద్రుష్టి సారించాలని, పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు గడ్కరీ వెల్లడించారు. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు ప్రజలను తీసుకెళ్లాన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కోసం వినియోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలను దేశంలోనే 80 శాతం తయారు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో వంద శాతం ఇండియాలోనే తయారవుతయాన్నారు. దీంతో పాటు ధర కూడా తగ్గే అవకాశం ఉందని నితిన్ గడ్కరీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version