ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. కూర్గ్ ని చూసొచ్చేయండి..!

-

ఐఆర్‌సీటీసీ ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలను తీసుకు వచ్చింది. అయితే బాగా పేరొందిన పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్‌ జలపాతం చూసేందుకు కూడా ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నగర వాసుల కోసం ప్రత్యేకంగా ఈ టూర్ ని తీసుకొచ్చింది. దీనితో కూర్గ్ తో పాటుగా పలు ప్రదేశాలను కూడా చూసి వచ్చేయచ్చు. ఇక ఈ టూర్ కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ‘కాఫీ విత్ కర్ణాటక’ పేరుతో ఈ టూర్ ని తీసుకొచ్చారు. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ఈ టూర్ ప్యాకేజీలో కూర్గ్‌తో పాటు మంగళూరును కూడా చూడచ్చు. టూర్ కి సంబంధించి వివరాల లోకి వెళితే.. పర్యాటకులు మొదటి రోజు ఉదయం 6:05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ ఎక్కాలి. రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు రీచ్ అవుతారు. హోటల్ లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యాక మంగళూరు లోకల్ సైట్ సీయింగ్ కి వెళ్ళచ్చు.

పిలికుల నిసర్ఘధామ, మంగళదేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్‌బావి బీచ్‌ వంటి వాటిని చూడచ్చు. మూడో రోజు ఉదయం కూర్గ్‌కు స్టార్ట్ అవ్వాలి. ఓంకారేశ్వర ఆలయం, అబ్బే ఫాల్స్ ని అక్కడ చూసి స్టే చెయ్యాలి. నాలుగో రోజు ఉదయం కావేరీ నిసర్ఘధామ చేరుతారు. ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి తలకావేరీ, భాగమండల విజిట్‌ ఉంటుంది. ఆ తర్వాత మంగళూరుకు బయల్దేరాలి.

ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుతారు. టూర్ ముగుస్తుంది. ధరలు విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9,230 కాగా డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11,570. సింగిల్ ఆక్యుపెన్సీకైతే రూ.20,780 చెల్లించాల్సి ఉంటుంది. అదే కంఫర్ట్ ప్యాకేజీ ధరలు అయితే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,230 కాగా డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,570, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.23,780 చెల్లించాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version