IRCTC నుండి టూర్ ప్యాకేజీలు వస్తున్నా సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుపతి టూర్ ప్యాకేజీని అందించారు. మరి ఆ టూర్ వివరాల లోకి వెళితే…. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ టూర్ ఉంటుంది. అలానే శ్రీవారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా చేస్తోంది. అలానే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం తో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీ కాళహస్తి, తిరుచానూర్ ఆలయాలకు కూడా చూడొచ్చు. 2021 మార్చి 5, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23 తేదీల్లో ఈ టూర్ ఉంటుంది అని IRCTC చెప్పడం జరిగింది.
Day 1 : ఉదయం హైదరాబాద్ లో విమానం ఎక్కి గన్నవరం తిరుపతికి చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం చూడొచ్చు. సాయంత్రానికి తిరిగి హోటల్‌కు వెళ్లి అక్కడే స్టే చేయాలి.
Day 2 : తెల్లవారుజామున తిరుపతి శ్రీ వారి దర్శనానికి వెళ్ళాలి. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.ఆ తర్వాత తిరిగి హోటల్‌కు వెళ్ళాలి. నెక్స్ట్ తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి చూడొచ్చు. ఆ తర్వాత తిరుపతి ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ చేరుకుంటారు అంతే.
లేదు అంటే తిరుపతికి వచ్చే వారికి కూడా ఐఆర్‌సీటీసీ ఇంకో ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధర రూ.990 మాత్రమే. తిరుమల, తిరుచానూరు ఆలయాలు దర్శించుకోవచ్చు. అలానే తిరుమల, తిరుచానూరు ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్ సైట్‌లో డివైన్ బాలాజీ దర్శన్ అనే పేరుతో ఇది ఉంటుంది చూసి బుక్ చేసుకోండి.