IRCTC: మార్చి 14న ఈ లగ్జరీ రైలు సేవలు షురూ…!

-

కరోనా కారణంగా నిలిపి వేసిన లగ్జరీ రైలు సేవలు తిరిగి మార్చి 14న స్టార్ట్ అవ్వనున్నాయి. ఇటీవల టూర్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగి పోతుండటం తో ఐఆర్‌సీటీసీ లగ్జరీ రైలు గోల్డెన్ ఛారియట్‌ సేవలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. పైగా దీనికి క్రేజ్ కూడా ఎక్కువే. కర్నాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి ఐఆర్‌సీటీసీ నడుపుతున్న గోల్డెన్ ఛారియట్ రైలుకు పర్యాటకులు ఎప్పుడు ఎక్కువగానే వుంటారు.

ఏటా 10 కోట్ల మంది భారతీయ పర్యాటకుల తో పాటు 5,00,000 నుంచి 6,00,000 మంది విదేశీ పర్యాటకులను ఇది ఆకర్షిస్తుంది. ఇక ఈ సర్వీసుల గురించి చూస్తే… బెంగళూరు నుంచి కర్నాటక, కేరళ, తమిళనాడు, గోవా లోని పర్యాటక ప్రాంతాలకు ఇవి వెళ్తాయి. ఎన్నో అద్భుతమైన ప్రదేశాలని కూడా చూసేయొచ్చు.

మార్చి 14న ఈ రైలు బెంగళూరులో బయల్దేరుతుంది. బందీపూర్ నేషనల్ పార్క్, మైసూర్, హళిబీడు, చిక్మగళూర్, హంపి, ఐహోల్, పట్టడకల్, గోవా లో ఉంటే ప్రదేశాలు చూడొచ్చు. ఈ ప్రైడ్ ఆఫ్ కర్నాటక 6 రోజులు 7 రాత్రుల ప్యాకేజీ. ఇక జ్యూవెల్ ఆఫ్ సౌత్ అయితే మార్చి 21న స్టార్ట్ అవుతుంది. మైసూరు, హంపి, మహాబలిపురం ప్రాంతాలను చూసి రావచ్చు. ఏది ఏమైనా ఈ లాకేజరీ ప్యాకేజీ సూపర్ గా ఉంటుంది.

లగ్జరీ రైలులో ప్రయాణం, భోజనం, ఏసీ బస్సుల్లో సైట్ సీయింగ్, ఎంట్రీ ఫీజులు, టూరిస్ట్ ప్రాంతాల్లో భోజన సదుపాయం వాహ్ అన్ని కూడా భలేగా ఉంటాయి. స్పెషల్ సదుపాయాలు అందర్నీ బాగా ఆకర్షిస్తాయి. ఇందులో 11 గెస్ట్ క్యారేజెస్, 4 గెస్ట్ క్యాబిన్స్ ఉంటాయి. అందులో 13 డబుల్ బెడ్ క్యాబిన్స్, 30 ట్విన్ బెడ్ క్యాబిన్స్, దివ్యాంగుల కోసం 1 క్యాబిన్ ఉంటాయి. పైగా ఇందులో రెండు రెస్టారెంట్లు, బార్ కూడా వున్నాయి. ఆయుర్వేదిక్ స్పా థెరపీలు, జిమ్ కూడా ఈ రైలులో ఉంటాయి. ఇలా ఎన్నో అద్భుతమైన సర్వీసులు వున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news