త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గత కొన్ని రోజులుకు బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ ఎన్నికల్లోనే కాదు తిట్టుకోవడంలోనూ పోటీ పడుతున్నారు. పార్టీ అధిష్ఠాన నాయకుల నుంచి మొదులుకొని మండలాల నాయకుల వరకు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. తమ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని బీజేపీ నాయకులు.. కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత బీజేపీ తెలంగాణకు చేసిందేవీ లేదని టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి బీజేపీ విమర్శలు గుప్పించారు.
టీఆర్‌ఎస్‌కు ఓటేయకుంటే మీకే నష్టం..
ఎమ్మెల్సీ∙ఎన్నికల నేపథ్యంలో జడ్చర్లలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులను గెలించాలని.. పొరపాటున బీజేపీ పార్టీకి ఓటేస్తే అదే వేలితో కళ్లలో పొడుచుకున్నవారవుతారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొంది టీఆర్‌ఎస్ ఓటేయని వారిని భగవంతుడు కూడా క్షేమించాడని ఆ కుటుంబం ఎప్పటికీ బాగుపడదన్నారు. ఇప్పుటికే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఏ శాఖలోనైనా టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే వారి సమస్యలు పరిష్కరామవుతాయన్నారు. బీజేపీని గెలిపిస్తే మళ్లీ ఐదేళ్ల వరకు ఇటువైపు కన్నెతి చూడరని ఆరోపించారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబానికి మరిన్న సంక్షేమ పథకాలు అందాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి దేవీని గెలిపించాలని పిలుపునిచ్చారు.