ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే వాటిలో రక్తహీనత కూడా ఒకటి. ఐరన్ శాతం తక్కువగా ఉండడం వలన రక్తహీనతతో బాధపడాల్సి ఉంటుంది. కనుక రక్తహీనతకు చెక్ పెట్టాలి అని అనుకుంటే ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. పుచ్చకాయలు తీసుకోవడం వలన తగినంత ఐరన్ శరీరానికి అందుతుంది. ప్రతి 100 గ్రాములకు 0.4 మిల్లీగ్రాముల ఐరన్ పుచ్చకాయల్లో ఉంటుంది. పైగా పుచ్చకాయలు రుచికరంగా కూడా ఉంటాయి, కనుక ఎవరైనా వీటిని తీసుకోవచ్చు.
ఖర్జూరాల్లో కూడా ఐరన్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రతి రోజు ఉదయాన్నే ఖర్జూరాన్ని తినడం వలన ఎన్నో లాభాలను మీరు పొందవచ్చు. కివీ పండ్లలో 0.3 మిల్లీగ్రాముల వరకు ఐరన్ ఉంటుంది. వీటిని తినడం వలన శరీరానికి తగినంత ఐరన్ తో పాటుగా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని తరచుగా మీ డైట్ లో తీసుకోండి. ఆపిల్స్ లో 0.5 మిల్లీగ్రామ్ ల ఐరన్ ఉంటుంది. అంతేకాక యాపిల్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కనుక ప్రతిరోజు యాపిల్ ను తీసుకోండి.
దానిమ్మ పండులో 0.3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దానిమ్మ పండులో ఐరన్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కూడా ఉంటాయి. కనుక శరీరం ఐరన్ ను బాగా తీసుకుంటుంది. అత్యధికంగా ఐరన్ ను పొందాలనుకుంటే ఎండుద్రాక్షను తప్పకుండా తీసుకోవాలి. వీటిలో 1.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అంతే కాకుండా ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. కనుక ఈ పండ్లను మీ రోజు వారి డైట్ లో భాగంగా తీసుకుంటే, రక్తహీనత సమస్యను ఎంతో త్వరగా నయం చేయవచ్చు.