వేసవి కాలంలో నీటి ఎద్దడి కారణంగా తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. సాగుకు నీరు లేకపోవడంతో వేసినన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పెట్టుబడి కూడా వెల్లుబాటు కాకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరువుతున్నారు. గతేడాది ఇదే సమయానికి నీటి ఎద్దడి మరి ఇంతగా లేదని రైతులు వాపోతున్నారు.
సాగు నీరు లేక పంటలు ఎండిపోవడంతే.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్వామి అనే రైతు తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేశాడు.వేసిన బోరు ఫెయిల్ అవడంతో ఆందోళన చెందాడు. పంట పెట్టుబడి కోసం అప్పు చేసిన రైతు స్వామి.. అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.