బిజెపి పార్టీకి సంబంధించిన యంగ్ ఎంపీ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అతను ఎవరో కాదు బిజెపి పార్లమెంటు సభ్యులు తేజస్వి సూర్య. ఇండియాలోనే అత్యంత పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యులలో కర్ణాటక ఎంపీ తేజశ్రీ సూర్య ఒకరు. అయితే అలాంటి తేజస్వి సూర్య త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. చెన్నై నగరానికి సంబంధించిన ప్రముఖ సింగర్, భరతనాట్య కళాకారుని శివశ్రీ స్కంద ప్రసాద్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు తేజస్వి సూర్య.
తేజస్వి సూర్య పెళ్లి చేసుకోబోయే సింగర్ శివశ్రీ… తమిళ సినిమాలకు సింగర్ గా పని చేశారు. పొన్నీయన్ సెల్వన్ 2 లాంటి పెద్ద సినిమాలకు కూడా సాంగ్స్ అందించారు. ఈమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇక అటు వృత్తిపరంగా లాయర్ గా పనిచేశారు తేజస్వి సూర్య. కానీ కాలక్రమైనా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఎంపిక కూడా పనిచేస్తున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించిన తేజస్వి సూర్య… 2020 నుంచి భారతీయ జనతా పార్టీ యువమోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇక తేజస్వి సూర్య పెళ్లి మార్చి 24వ తేదీన జరగనుంది. ఈ వివాహం చెన్నైలో నిర్వహించబోతున్నారు.