రాజాసింగ్‌ని సైడ్ చేసినట్లేనా!

-

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం వైఖరి ఏంటో ఇంకా క్లారిటీ రావడం లేదు. కేసీఆర్ గాలిలో కూడా తెలంగాణలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ని బీజేపీ అధిష్టానం నిదానంగా సైడ్ చేస్తుందా? అనే డౌట్ కార్యకర్తల్లో వస్తుంది. ఎప్పుడు ఏదొక వివాదంలో ఉండే రాజాసింగ్ వల్ల పార్టీకి లాభం లేదని బీజేపీ భావిస్తుందా? అంటే ప్రస్తుతానికి పరిస్తితులు అలాగే కనిపిస్తున్నాయి.

ఇటీవల మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రాజాసింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ పై విడుదల కావడం జరిగిపోయాయి. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలో ఎం‌ఐ‌ఎం శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. దీంతో పోలీసులు పీడీయాక్ట్ కింద రాజాసింగ్‌ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ విషయంలో రాజాసింగ్‌కు బీజేపీ నుంచి సపోర్ట్ రాలేదు. అటు గోషామహాల్ నియోజకవర్గానికి కొందరు కార్యకర్తలు మాత్రమే రాజాసింగ్‌కు మద్ధతు తెలిపారు. అక్కడ కార్పొరేటర్లు కూడా రాజాసింగ్‌కు మద్ధతు తెలపలేదు.

దీంతో బీజేపీ నుంచి రాజాసింగ్‌ని సైడ్ చేస్తున్నారని, నెక్స్ట్ ఎన్నికల్లో గోషామహాల్‌లో ఉన్న ముగ్గురు కార్పొరేటర్లలో ఎవరో ఒకరికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే..ఈ మధ్య బీజేపీ ఫ్లెక్సీల్లో రాజాసింగ్ బొమ్మ కనబడటం లేదు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు కట్టే ఫ్లెక్సీల్లో ఖచ్చితంగా రాజాసింగ్ బొమ్మ ఉండేది. అలాగే బండి సంజయ్ పాదయాత్రకి శాంబంధించిన ఫ్లెక్సీల్లో కూడా రాజాసింగ్ ఫోటో ఉండేది.

కానీ తాజాగా బండి పాదయాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొదలైంది. ఈ పాదయాత్ర మొదలైన సందర్భంగా కట్టిన ఫ్లెక్సీల్లో రాజాసింగ్ ఫోటో లేదు. ఇప్పటికే రాజాసింగ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. అందుకే ఆయన ఫోటోలు వేయడం లేదా? ఆయనని నిజంగానే పార్టీని నుంచి సైడ్ చేసేశారా అనే డౌట్ సాధారణ బీజేపీ కార్యకర్తలకు వస్తుంది. మరి చూడాలి జైలు నుంచి వచ్చాక రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలా ముందుకెళుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version