సోషల్ మీడియాలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఫేక్ వార్తలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. కొందరు పనిగట్టుకుని కావాలని ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆడ పిల్లలందరికీ తలా రూ.2 లక్షల చొప్పున ఇస్తుందనే ఓ వార్త ప్రస్తుతం ఎక్కువగా ప్రచారమవుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని వెల్లడైంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని 8 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ప్రతి ఆడపిల్లకు బేటీ బచావో, బేటీ పఢావో స్కీం కింద రూ.2 లక్షల చొప్పున అందజేస్తుందని, అందుకు వారు ఓ ఫాం నింపాలని, దాంట్లో వారి పేరు, వయస్సు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేర్లు, చిరునామా, బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్‌సీ నంబర్లు ఎంటర్ చేయాలని, దీంతో ఆడపిల్లకు రూ.2 లక్షలు ఇస్తారని.. ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
दावा: बेटी बचाओ बेटी पढ़ाओ योजना के नाम पर बांटे जा रहे एक फॉर्म में यह दावा किया जा रहा है कि सभी बेटियों को 2 लाख रूपए दिए जायेंगे।#PIBFactCheck: यह फॉर्म फर्जी है। ऐसे किसी भी तरह के फॉर्म का वितरण अवैध है व इस योजना के तहत किसी भी तरह का नगद प्रोत्साहन नहीं दिया जाता है। pic.twitter.com/rQXZX45EUN
— PIB Fact Check (@PIBFactCheck) October 1, 2020
కాగా సదరు వార్త అబద్దమని, కేంద్రం అలాంటి స్కీంను దేన్నీ అమలు చేయడం లేదని, సోషల్ మీడియాలో ప్రచారవుతున్న ఆ వార్తను నమ్మవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడైంది. ఇలాంటి వార్తలను నమ్మి మోసపోవద్దని పీఐబీ సూచించింది.