కరోనాని చైనానే తయారు చేసిందా…? ఇప్పుడు చేతులు కాల్చుకుంటుందా…?

-

కరోనా వైరస్ ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది…? ఎప్పుడో 1966 లో తొలిసారి గుర్తించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఎందుకు వణికించే పరిస్థితి ఏర్పడింది…? సాంకేతిక, వైద్య రంగాల్లో ప్రపంచంతో పోటీ పడే చైనా ఈ వైరస్ ని ఎందుకు కట్టడి చేయలేకపోతుంది…? ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు కనుకున్న చైనా వాసులు దీనికి ఎందుకు వ్యాక్సిన్ ని కనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు…? ప్రపంచ వ్యాప్తంగా ఇది విస్తరించడం వెనుక అసలు కారణాలు ఏంటీ…?

కచ్చితంగా ఇప్పుడు వేళ్ళు అన్ని చైనా వైపే చూపిస్తున్నాయి. జీవ రసాయన ఆయుధాల మీద ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది. కాని అమెరికా వలన ఆత్మరక్షణకో లేక దేనికైనా యుద్దానికి సిద్దమవుతుందో చైనా కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అమెరికా మీద పెత్తనం చేలాయించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చైనా చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకుంటుంది అనేది అంతర్జాతీయ౦గా వినపడుతున్న మాట, అసలు ఈ కరోనా వైరస్ ఎందుకు బయటకు వచ్చింది అంటే…

కరోనా వైరస్ కి సంబంధించి వైరస్ బయటకు వచ్చిన వూహాన్ నగరంలో పరిశోధనలు చేస్తున్నారు. అ వైరస్ అక్కడ లీక్ అయి ప్రమాదవ శాత్తు బయటకు వచ్చి అక్కడ పని చేస్తున్న ఇద్దరికి సోకింది. వెంటనే వాళ్ళను ప్రత్యేక వైద్య శాలకు తరలించినా ఫలితం లేకుండా పోయింది. దీనితో వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి౦ది. దీని వలన చైనానే ఎక్కువగా నష్టపోతుంది. ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలని చూసినా ఇప్పుడు ఇది కట్టడి అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు.

చైనా ఇప్పుడు దీనికి మందు కనుక్కోలేకపోయినా, ప్రపంచ దేశాల నుంచి ఏ మాత్రం సహకారం అందకపోయినా ఎబోలా, ఆంత్రాక్స్, సార్స్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ అత్యంత ప్రమాదకరమైన వైరస్ లు. ఇప్పుడు ఆ జాబితాలోకి కరోనా కూడా చేరింది. ఇవి అన్ని కూడా బయోవార్ లో భాగంగా బయటకు వచ్చి అమాయక పౌరుల ప్రాణాలను తీస్తున్నవే. ఆర్ధికంగా బలపడటానికి చైనానే ఈ వైరస్ ని విడుదల చేసిందా…? తనకు తానే నష్టపోయిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ప్రపంచం వ్యక్తం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version