జంపింగులకు హస్తం చెక్..ఆ సీట్లలో కారుకు ఓటమే?

-

ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కనిపించిన ఆధిపత్య పోరు…ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతల మధ్య రగడ తీవ్ర స్థాయిలో ఉంది. ఈ రగడ వల్ల టీఆర్ఎస్ పార్టీకి గట్టి డ్యామేజ్ జరిగేలా ఉంది. జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న సీట్లలో కారు పార్టీ గల్లంతయ్యేలా ఉంది.

మామూలుగా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య రచ్చ ఎక్కువ జరుగుతుంది. అది ఎప్పుడూ ఉంటుంది..కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో అలాంటి ఆధిపత్య పోరు కనబడటం లేదు. అయితే టీఆర్ఎస్ లో పోరు మొదలైంది. ఈ పోరు పెరగడానికి కారణం కేవలం ఇతర పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించడమే. 2014లో గెలిచి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పెద్ద ఎత్తున వలసలని ప్రోత్సహించింది. అప్పుడు టీఆర్ఎస్ బలం తక్కువగా ఉండటంతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు. అలా చేయడం వల్ల టీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ వచ్చింది.

2018లో భారీగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చి కూడా టీఆర్ఎస్ కకృతి పడింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలని తీసుకుంది. మొత్తం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు. ఇలా తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ కి సంఖ్యా బలం తగ్గిందే తప్ప..పెద్దగా నష్టం రాలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంఖ్యా బలం పెరిగింది…అయితే క్షేత్ర స్థాయిలో పార్టీకి డ్యామేజ్ పెరిగింది.

ఎక్కడకక్కడ వలస వచ్చిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతల మధ్య ఫైట్ నడుస్తోంది..అన్నీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలని కాంగ్రెస్ లాగేసుకుంటుంది. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి సీటు వచ్చిన సొంత పార్టీ వాళ్ళే ఓడించేలా ఉన్నారు. ఉదాహరణకు పాలేరు సీటులో జంపింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పొసగడం లేదు.

నెక్స్ట్ ఉపేందర్ రెడ్డికి కారు సీటు ఇస్తే…తుమ్మల వర్గం సహకరించదు. ఒకవేళ తుమ్మలకు సీటు ఇస్తే ఉపేందర్ వర్గం హ్యాండ్ ఇస్తుంది. మొత్తానికి కారుకు డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇక ఆ సీట్లలో హస్తం పార్టీకి మంచి ఛాన్స్ ఉంటుంది. అయితే ఆయా సీట్లలో పరిస్తితులని బీజేపీ అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version