బాబుతో రేవంత్ రెడ్డి కి కష్టమేనా?

-

టీడీపీ అధినేత చంద్రబాబు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి revanth reddy ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే సంగతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు రేవంత్ టీడీపీలోనే ఉన్నప్పుడు, చంద్రబాబు ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో కూడా తెలుసు. అలాగే రేవంత్‌కు బాబు అంటే ఎంత గౌరవమో కూడా తెలుసు. అందుకే టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరినా కూడా ఏనాడూ బాబుపై రేవంత్ ఒక్క విమర్శ కూడా చేయలేదు.

రేవంత్ రెడ్డి/ revanth reddy

ఇక దీని బట్టే చూసుకోవచ్చు బాబు, రేవంత్‌ల మధ్య ఎలాంటి బంధం ఉందో. కానీ ఇప్పుడు అదే బంధం రేవంత్‌కు ఇబ్బంది అయ్యేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌కు పీసీసీ రావడం వెనుక బాబు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్‌పై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ కాస్త టీడీపీ మాదిరిగా మారిపోతుందని అంటున్నారు.

పైగా రేవంత్‌కు వెనుక సపోర్ట్‌గా ఉన్న నాయకుల్లో ఎక్కువగా టీడీపీ నుంచి వచ్చినవారే ఉన్నారు. దీని బట్టి చూస్తే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త అర్ధవంతంగానే ఉన్నాయని అంటున్నారు. కాకపోతే తనకు పీసీసీ ఇవ్వడం వెనుక చంద్రబాబు ఉన్నారనే ఆరోపణలని తప్పించుకోవడానికి రేవంత్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తాను కాంగ్రెస్ బిడ్డని అని, సోనియా గాంధీ మనిషిని అని రేవంత్ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చెప్పడం వల్ల తాను బాబు మనిషిని కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకవేళ బాబు ఇమేజ్ రేవంత్ మీద పడితే కాంగ్రెస్‌కే నష్టం జరిగే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకుంటే, కేసీఆర్, బాబునే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. బాబు తెలంగాణ ద్రోహి అని హైలైట్ చేశారు. దీంతో ఆ ప్రభావం కాంగ్రెస్ మీద కూడా పడి ఘోరంగా ఓడిపోయింది. అంటే తెలంగాణ రాజకీయాల్లో బాబు ఇమేజ్ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. అందుకే రేవంత్, బాబు ఇమేజ్ తన మీద పడకుండా చూసుకునేందుకు బాగానే కష్టపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version