ప్రయాణికులకు గుడ్ న్యూస్… మెట్రో రైలు టైమింగ్స్ పెంపు

-

హైదరాబాద్ ప్రయాణికులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా మరియు లాక్ డౌన్ కారణంగా మెట్రో రైలు సర్వీసులు దాదాపు తగ్గించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ఎత్తివేయడం తో … ఎప్పటిలాగే మెట్రో సర్వీసులను పునరావృతం చేశారు అధికారులు. దీంతో ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు వేళలను రాత్రిపూట పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Metro

దీని ప్రకారం.. ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9 గంటలకు కాకుండా.. 9 :45 గంటలకు బయలు దేరానుంది. అలాగే రాత్రి 10:40 గంటలకు గమ్యస్థానాన్ని చేరుతుంది. రాత్రి ఆలస్యంగా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే వారికి ఈ పెంచిన టైమింగ్స్ ఎంతో ఊరట కలిగించనుంది. అయితే ఈ పెంచిన టైమింగ్స్ శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయని l&t హైదరాబాద్ మెట్రో రైలు ఎండి కెవీబీరెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version