గర్భిణీలు బొప్పాయి తినకూడదా..ఇందులో అసలు నిజమెంత ఉందో తెలుసా..?

-

పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది. తల్లి అవ్వటం అంటే కేవలం ఒకరికి జన్మనివ్వటమే కాదు. ఆది ఆ స్త్రీమూర్తికి కూడా పునర్జనన్మలాంటిదే. అయితే మీరు లేదా మీ ఇంట్లోవాళ్లు ఎవరైనా ఎప్పుడైతే తల్లికాబోతున్నారు అని తెలిసిందే..పెద్దొళ్లు ఇక జాగ్రత్తలు చెప్పటం స్టాట్ చేస్తారు. ఇవి తినాలి, ఇవి తినకూడదు అని. ఈ తినకూడదు అని చెప్పే లిస్ట్ లో బొప్పాయిపండు పక్కా ఉంటుంది. గర్భీణీలు బొప్పాయి తినకూడదని మనం చాలా సినిమాల్లో తెలగు సీరియల్స్ అయితే బాగా చూసి ఉంటాం. అసలు నిజంగానే తినకూడదా..ఇందులో వాస్తవం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

గర్భిణిగా ఉన్న సమయంలో బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని పెద్దలు హెచ్చరిస్తారు. దీనికి కారణం ఏంటంంటే బొప్పాయిని తెంపినప్పుడు దాని నుంచి కారే తెల్లటి పదార్థం. ఇది ఒక ఎంజైమ్. దీంట్లో లేటెక్స్ ఉంటుంది. ఇది గర్భస్రావానికి దారి తీస్తుందని ఇప్పటివరకూ మనం నమ్ముతున్నాం.

బొప్పాయి పండులోని ఎంజైమ్ లు ప్రోస్టోగ్లాండిన్ ను విడుదల చేయడానికి దోహదపడతాయి. ప్రోస్టోగ్లాండిన్ గర్భాశయం సంకోచించేలా చేస్తుంది. దీనివల్ల గర్భవిచ్చిత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2002లో ఎలుకల మీద చేసిన ఓ అధ్యయనంలో పండిన బొప్పాయి తిన్న ఎలుకల్లో ఎలాంటి ప్రభావం కనిపించలేదు. అవి సురక్షితంగానే ఉన్నాయి. అదే సమయంలో పచ్చి బొప్పాయిపండు తిన్న ఎలుకల్లో అబార్షన్, సమయం కంటే ముందే డెలివరీ అయిందట.

అయితే మనుషుల మీద ఇలాంటి ప్రయోగాలు ఇప్పటివరకూ జరగలేదు. అంతేకాదు ఏ అధ్యయనం కూడా బొప్పాయి వల్ల అబార్షన్ అవుతుందన్నదానికి ఖచ్చితమైన ఆధారాలను చూపలేదు. అయితే, గర్భిణిలు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండడం మంచిదని వైద్యులు చెబుతున్నారు

బాగా పండిన బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. గర్భిణీలు తినొచ్చు కూడా.. కానీ అదే పచ్చి బొప్పాయి వల్ల గర్బాశయ గోడలు సంకోచానికి గురవ్వడం, జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలా తొలిసారిగా గర్బిణీలకే అవుతుందట.

బొప్పాయిలో కెరోటిన్ ఉంటుంది. ఇది వాస్కులర్ ప్రెజర్ కు దారి తీస్తుంది. దీనివల్ల ప్లాసెంటాలో ఇంటర్నల్ బ్లీడింగ్ కు అవుతుంది. అందుకే గర్భిణులు బొప్పాయి తినాలనుకుంటే.. తినేముందు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాల్సిందే.

మీకు ఇది కూడా తెలుసే ఉంటుంది..ఎవరైనా త్వరగా పిరియడ్స్ రావాలనుకుకంటే పచ్చిబొప్పాయి తింటారు..ఎందుకంటే పచ్చి బొప్పాయి పండు తినడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ సింథసిస్ అవుతుంది. ఈస్ట్రోజన్ వల్ల గర్బాశయ గోడలు సంకోచిస్తాయి. దానివల్ల తొందరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

ఇదండి..బొప్పాయి తినకూడదు..తింటే గర్భాశ్రవం అ‌వతుంది అని మాత్రమే కాదు..అసలు ఎందుకు తినకూడదు..తింటే ఏం జరుగుతుంది బాడీలో అనేది కూడా ప్రతిమహిళకు అవగాహన ఉండాలి. గర్భిణీలు పచ్చిబొప్పాయి తినకూడదు అంతే..బాగా పండిన బొప్పాయి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు వైద్యులు. బొప్పాయిలో మంచి మంచి పోషకవిలువలు, విటమిన్స్ ఉన్నాయి. మీకు బొప్పాయి అంటే ఇష్టం ఉండి..గర్భిణీగా ఉన్నట్లైతే ఇదే విషయాన్ని ఓ సారి మీ డాక్టర్ కి సంప్రదించి తినండి.. వైద్యలు కూడా ఇదే చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version