ఏపీ వాసులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి షాక్ ఇచ్చింది. అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీలలో పెన్షన్లు తీసుకుంటున్న వారికి అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు ఇచ్చి పెన్షన్లను రద్దు చేయనున్నారు. ఈరోజు నుంచి ఈనెల 25 వరకు సచివాలయ సిబ్బంది పెన్షన్ల ప్రక్రియను చేపడతారు. 40% కన్నా తక్కువ వైకల్యం ఉన్న వారి పెన్షన్లను రద్దు చేస్తారు.

అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. ఇదిలా ఉండగా…. ఏపీలోని స్త్రీలకు శుభవార్త అందించాడు చంద్రబాబు నాయుడు. స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు సౌకర్యాన్ని రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందులో మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకానికి మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు. రేపటి నుంచే మహిళలు ఫ్రీ బస్సులలో వెళ్ళవచ్చు.