అమిత్ షాపై మోడీ ఆగ్రహంగా ఉన్నారా…?

-

అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో బిజెపి ఆగ్ర నాయకత్వం ఆగ్రహంగా ఉందనే ప్రచారం కొన్ని రోజులుగా ఎక్కువగా జరుగుతుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఈ విషయంలో దూకుడుగా ఉండటంతో ఎవరూ అడ్డు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అటు కేంద్ర మంత్రులు కూడా జరిగే నష్టాల గురించి వివరించినా అమిత్ షా వెనక్కు తగ్గలేదు.

క్యాబ్ విషయంలో ఏమో గాని ఎన్నార్సి విషయంలో మాత్రం మోడీ తీవ్ర అసహనంగా ఉన్నారని అంటున్నారు. దానికి కారణం మైనార్టీలు పార్టీకి పూర్తిగా దూరంగా జరిగే అవకాశం ఉందని మోడీ భావిస్తున్నారు. ఇప్పటికే అయోధ్య తీర్పు పార్టీకి నష్టం చేకూర్చించింది అని అందుకే ఝార్ఖండ్ ఎన్నికల్లో ఓడిపోయామనే అసహనం మోడీ లో ఉంది. అయితే పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రావాలి అంటే,

ఎన్నార్సి అవసరమని అమిత్ షా భావిస్తున్నారు. అది అమలు చేస్తే ముస్లింలు దూరం జరగడం ఖాయమనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అందుకే మోడీ ఎన్నార్సిని అమలు చేసేది లేదని చెప్తున్నారు. అయితే అమిత్ షా మాత్రం మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చెయ్యాలని చూస్తున్నారు. ఈ బిల్లు విషయంలో హిందువుల్లో ఏ ఇబ్బంది లేదనే విషయం అర్ధమవుతుంది.

వచ్చే ఎన్నికల తర్వాత మోడీ వయసు 75 ఏళ్ళు దాటుతుంది కాబట్టి ఆయన తప్పుకుని అమిత్ షాకి ప్రధానిగా అవకాశం ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే హిందుత్వ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది కాబట్టి తనకు కలిసి వస్తుంది అనేది అమిత్ షా భావన. అటు పార్టీ సీనియర్లు కూడా ఎన్నార్సి విషయంలో వెనక్కు తగ్గకపోతే భవిష్యత్తులో కీలక రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఓడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version