మూసీ పై బహిరంగ చర్చకు సిద్దమా రేవంత్..? : హరీశ్ రావు

-

మూసీ బాధితుల సమస్యలపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా..? అని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. దీనిపై చర్చించడం కోసం ఎక్కడికైనా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం.. బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రజలను కేంద్రాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ బాధితుల పక్షాన కోర్టుకు వెళ్తామని.. రేవంత్ రెడ్డి పై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు.

Harish Rao

తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా మూసీ పై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి రమ్మంటారో చెప్పండి.. వస్తాను. మేము దేని గురించైనా ప్రశ్నిస్తే.. మాపై బురద జల్లుతున్నారు. బుల్డోజర్ ఎక్కిస్తా రా..? సంపేస్తా.. తొక్కుతా.. లీడర్లతో తిట్టించడం అనేది సొల్యూషన్ కాదు అని పేర్కొన్నారు హరీశ్ రావు. సచివాలయం రమ్మన్నా నేను వస్తానని హరీశ్  రావు సవాల్ చేశారు. అఖిల పక్ష సమావేశం పెడుతానన్నావు. మేము రావడానికి సిద్దం అని చెప్పాం. ఎప్పుడైనా మేము సిద్దమని చెప్పినట్టు తెలిపారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version