నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం అదేనా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు పొందిన జంట సమంత,నాగచైతన్య. దాదాపుగా 5 సంవత్సరాలుగా ప్రేమించుకోని వివాహం చేసుకున్న ఈ జంట 4 సంవత్సరాల తర్వాత తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేశారు. తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నా ఈ జంట పలు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే వీరి విడాకులకు సరైన కారణాలు ఇప్పటికీ కూడా బయటికి రాలేదు. విడాకుల అనంతరం సమంత కేవలం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ఇక చైతన్య కూడా అలాగే సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం ఒక భయంకరమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది అభిమానులు సమంత ఈ వ్యాధి వల్లే నాగచైతన్య విడిపోవడానికి ముఖ్య కారణం అంటూ ముడి పెడుతున్నారు. సమంత విడాకుల ముందే ఇలాంటి వ్యాధి ఉందని తెలుసు. అందుచేతనే నాగచైతన్య విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి.

సమంతకు కూడ ఈ వ్యాధి ముందే తెలుసని… ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతూనే ఉందనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ కారణం చేత నాగచైతన్య,సమంత విడిపోయారని ప్రస్తుతం నేటిజెన్లు సైతం భావిస్తున్నారు. ఇకపోతే సమంత పరిస్థితి తెలుసుకున్నటువంటి ఎంతోమంది సిని సెలబ్రిటీలు సైతం ఈమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక అక్కినేని అఖిల్ ,నాగార్జున కూడా ఈ విషయంపై స్పందించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నాగచైతన్య మాత్రం ఇప్పటికీ ఈ విషయంపై స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version