దానిమ్మ తొక్కను తీసిపారేయకండి..లెక్కలేని ప్రయోజనాలు ఉన్నాయ్

-

దానిమ్మ ఆరోగ్యానికి మేలైన ఫ్రూట్..ఇది కాస్త ఖరీదైనదే అయినా మరీ అంత కాస్ట్ అయితే కాదు..దానిమ్మ పండుని తినాలంటే..ముందు అది వలుచుకోవాలి. అసలు సగం మందికి..ఈ తొక్కవలుచుకునే పంచాయతీ మనవల్ల కాదని..తినటానికి బద్ధకిస్తారు. ఇంట్లో వాళ్లు చక్కగా వొలిచి..గింజలు గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇస్తే..అప్పుడు ఎంజాయి చేస్తూ తింటాం. అయితే మరీ ఈ ప్రాసెస్ లో తొక్కలు డస్టబిన్ లోకే వెళ్తాయి. కానీ దానిమ్మతొక్కతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..తెలిస్తే.. తినటం కంటే ముందు ఆ తొక్కకోసమే వొలుచుకుంటారు కూడా..

దానిమ్మ తొక్కలో సన్ స్క్రీన్ లోషన్ వంటి గుణం ఉంటుంది. సూర్య కిరణాల నుంచి వచ్చే హానికరమైన అల్ట్రా వేవ్ కిరణాల నుంచి మీ చర్మానికి దానిమ్మ తొక్కు రక్షణ ఇస్తుంది. దానిమ్మ తొక్క‌ను ఎండబెట్టి పొడి చేసుకుని.. అందులో రోజ్ వాటర్ క‌లిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. చ‌ర్మానికి నిగారింపు వ‌చ్చి ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

మొటిమలు పోగొట్టే గుణం కూడా దానిమ్మ తొక్కలకు ఉంది. దానిమ్మ తొక్కల పొడిని.. రెండు రోజులకోసారి నీళ్లలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే.. మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నోటి పరిశుభ్రతను కాపాడుకునేందుకు సహాయపడే అనేక లక్షణాలు దానిమ్మ తొక్కులో ఉన్నాయిగా. దానిమ్మ తొక్క పొడిని నీటిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.

దానిమ్మ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. దానిమ్మ తొక్క తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు, ఒత్తిడి తగ్గుతుంది.

గాయాలు, పుండ్లకు కూడా దానిమ్మ తొక్కలు మంచి మెడిసిన్‌లా పనిచేస్తాయి. వీటిని మెత్తని పేస్టులా చేసి గాయాలకు పెడితే త్వరగా మానిపోతాయి.

దానిమ్మ తొక్క‌ను ఎండబెట్టి, పొడిగా మార్చి.. ఆ పొడిని గోరు వెచ్చ‌ని కొబ్బ‌రి నూనెలో క‌లుపుకొని మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి… అనంత‌రం ఓ 15 నిమిషాల త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.. ఇలా త‌రుచూ చేస్తుంటే చుండ్రు స‌మ‌స్య తగ్గుతుంది.

దానిమ్మ తొక్క‌ల‌ను వేడి నీటిలో నాన‌బెట్టి ఆ నీటిని క‌షాయంలా తాగొచ్చు.. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఔష‌ధ గుణాల వ‌ల్ల శ‌రీరంలోని విష ప‌దార్థాలు బ‌య‌ట‌కి వెళ్లిపోతాయి

చూశారా..తొక్కలో ఎన్ని లాభాలు ఉన్నాయో..నిజానికి మనం తొక్కతీసుకునే తినే ప్రతి పండు తొక్కతో ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. అరటిపండు, నారింజ పండువి కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకునే ఉన్నాం..టైం ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండండి మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version