మోడీ-నితీశ్ చేసిన తప్పులే ఎన్డీఏ వెనుకబడటాకి కారణమా..?

-

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి వెనుకబడటానికి ఎన్నికల ప్రచారంలో మోడీ-నితీశ్‌కుమార్‌ చేసిన పోరపాట్లే కారణం అంటూన్నారు రాజకీయ విశ్లేషకులు..బీజెపి అంతర్గత సర్వేలలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పట్ల ఓటర్లలో వ్యతిరేక భావం ఉందని వెల్లడి కావటం, మరికొన్ని సర్వేలలో కూడా అదే ప్రతిబింబించినప్పటికీ నితీశ్‌ను కూటమీ సీఎం అభ్యర్థిక ముందుకే తెవడమే మోడీ చేసిన పోరపాటు..తొలుత ప్రచారంలో భాగంగా బిజెపి ఏర్పాటు చేసిన బ్యానర్లు, ముద్రించిన పోస్టర్లు, మీడియా వాణిజ్య ప్రకటనలలో నరేంద్రమోడీతో పాటు నితీష్‌ కుమార్‌ చిత్రానికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దశ ఎన్నికలు దగ్గరపడే ముందు ప్రచురించిన వాటిలో కేవలం నరేంద్రమోడీ చిత్రమే ఉంది. వీటిని చూసి జెడియు నేతలు హతాశులయ్యారు గానీ మౌనం వహించారు.

ఎన్నికల ప్రకటన నాటికి-తొలి దశ నాటికీ పోలికే లేదన్నది స్పష్టం. నితీష్‌ కుమార్‌తో అధిక సీట్ల కోసం బేరం పెట్టిన లోక్‌జనశక్తి పార్టీ అది వీలుగాకపోవటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు తిరుగుబాటు జెండా ఎగురవేసి జెడియు పోటీ చేస్తున్న అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను నిలిపింది..మిగిలిన చోట్ల బిజెపి అభ్యర్ధులను బలపరుస్తానని, తరువాత ఇద్దరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది..ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్న నితీష్‌ కుమార్‌ కుల రాజకీయాలతో పాటు, తాను లౌకిక వాదిని అని చెప్పుకొనేందుకు కొన్ని అంశాలతో విబేధించినా బిజెపితో కలసి అధికారాన్ని పంచుకొని మతవాసనలను కూడా అంటించుకున్నారని, అవినీతి పాలనకు తెరతీశారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి..

నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎన్నికల ప్రకటన తరువాత మరింతగా కనిపిస్తోంది..అరవై తొమ్మిది సంవత్సరాల నితీష్‌ కుమార్‌ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు..అందుకే స్ధిమితం కోల్పోయి ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది కూటమి వెనుకడటానాకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు విశ్లేషకులు.. ఒక సభలో మీరు ఓట్లు వేస్తే వేయండి లేకపోతే లేదు, అల్లరి చేయవద్దని విసుక్కున్నారు..మరో సభతో మోడీ ప్రసంగిస్తూ..కొడుకు కోసం ఏడెనిమది మందిని కన్నారు అంటూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఆర్‌జెడి నేత, లాలూ కుమారుడైన తేజస్వి యాదవ్‌ తిప్పి కొడుతూ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విమర్శించారు..బీహార్‌లో ఉన్న అసాంఘిక ముఠాలన్నీ దారి మార్చి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి మామూళ్లు వసూలు చేస్తున్నాయని ఈ ఎన్నికల సందర్భంగా జనం చెబుతున్నారు. నితీష్‌-బిజెపి కూటమి పాలన మీద పెరిగిన వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణమే.

బీహార్‌లో ఎన్‌డిఏ నుంచి ఎల్‌జెపి బయటకు పోయిన తరువాత కేంద్రంలో కూడా ఆ పార్టీని బహిష్కరించాలని నితీష్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినా బిజెపి తిరస్కరించటంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఎన్నికల తరువాత బిజెపి-ఎల్‌జెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రకటనలు ఖండించదగ్గ పెద్దవి కాదని బిజెపి కొట్టిపారవేస్తోంది. చిరాగ్‌ పాశ్వాన్‌ గురించి నరేంద్రమోడీ ఎలాంటి ప్రస్తావనలు చేయకపోవటంతో జెడియు నేతలు ఆశాభంగం చెందారు. ఇరవై ఒక్క మంది బిజెపి తిరుగుబాటుదార్లకు చిరాగ్‌ సీట్లు ఇచ్చారు. ఊహాగానాలను బిజెపి నేతలు గట్టిగా ఖండించలేదని జెడియు నేతలు చెప్పారు..ఎల్‌జెపి నేతలు తాము పోటీ చేస్తున్న చోట్ల ఎన్నికల తరువాత తాము బిజెపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అందువలన మోడీ మద్దతుదారులు తమకు ఓటు వేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version