తెలంగాణ రాష్ట్రంలో అసలు పాలన ఉందా? అంటూ మండిపడ్డారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. యెనిమిది యేండ్ల అధాయం..అప్పులు కాళేశ్వరం లో ధారపోశారని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదన్నారు బట్టి. కాలేశ్వరం ప్రాజెక్టు వరదకు మొత్తం మునిగిపోయిందన్నారు.కట్టిన వాల్స్ కూలి పోయాయని, యెనిమిది యేండ్ల సంపద..అప్పులు..నిరుపయోగం గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు కాలేశ్వరం ప్రాజెక్టు వద్ద ఏం జరుగుతుంది అనే పరిశీలనకు వెళ్తే కూడా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.Kgf మైన్ లోకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళ ఫోన్ లు తీసుకున్నట్టు, కాళేశ్వరం లో ఉద్యోగులను కూడా అలాగే చేస్తున్నారని దుయ్యబట్టారు భట్టి విక్రమార్క. అసలు కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారనీ ప్రశ్నించారు. కేటీఆర్ ఇంట్లోనే రెస్ట్ లో ఉన్నారు, రాష్ట్రం అతలాకుతలం ఐతుంటే కెసిఆర్ ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నారని మండిపడ్డారు.