జబర్దస్త్ నూకరాజు , ఆసియా మధ్య దూరం అందుకేనా..?

-

తెలుగు బుల్లితెరపై పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరూ మొదటి నుంచి మంచి స్నేహితులు.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. జబర్దస్త్ షోలో టీం లీడర్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నూకరాజు తన గ్రూప్ లోనే ఆసియాను కూడా చేర్చుకొని ఆమెతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు. చక్కగా సాగుతున్న లవ్ స్టోరీ లో అనుకోని చిక్కులు వచ్చాయి.. దీంతో అతడు తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

జబర్దస్త్ కమెడియన్ గా వెనుతిరిగి చూడకుండా దూసుకెళ్తున్న నూకరాజు.. తన ప్రేయసి ఆసియాతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలను కూడా చేస్తూ బాగా హైలైట్ అవుతున్నారు. ఈ విషయం ఇద్దరు కుటుంబాల్లో కూడా తెలుసు. దీంతో వీళ్ళిద్దరి వివాహం కూడా జరగబోతుందని ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో ఆసియా నూకరాజు పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని సమాచారం. ఈ జంట తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దలను ఎదిరించలేక విడిపోయిందని బుల్లితెర వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకొని జీ తెలుగు ఛానల్ లో రెండు రోజులు ముందుగానే ఓ రెండు ప్రేమ మేఘాలు అనే స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇందులో ఆసియా నూకరాజు జంటగా వచ్చి అలరించారు. అలాగే ఆమె పేరును ఏకంగా తన ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకొని చూపించాడు నూకరాజు. దీంతో ఆసియా ఒక్కసారిగా షాక్ అయి కన్నీరు పెట్టుకుంది. ఆసియాతో బ్రేకప్ జరిగిందన్న వార్తలపై నూకరాజు సమాధానం ఇచ్చాడు.. ఈ ఈవెంట్లు ఎన్ని వచ్చినా ఏ వచ్చినా నీ చేయి అయితే వదలను.. మనం నిజంగా ప్రేమించిన అమ్మాయి.. మనకు కాకుండా దూరం అయితే తట్టుకోలేము.. ఇటు ఫ్యామిలీ కావాలి.. అటు అమ్మాయి కావాలి ..ఈ బాధలు గుర్తొస్తే అంటూ కన్నీరు పెట్టుకున్నాడు నూకరాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version