రేపు హైదరాబాద్‌లోని బ్యాంకులకు సెలవేనా..?

-

బ్యాంక్ లో మనకి ముఖ్యమైన పనులు ఉంటాయి. సమయానికి పూర్తి చేసుకోవాలని అనుకునే సరికి బ్యాంక్ సెలవు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక బ్యాంకులు ఏయే రోజులు సెలవు అనేది ముందే తెలుసుకోవాలి. ఇక రేపు అనగా నవంబర్ ఎనిమిదిన హైదరాబాద్ లో బ్యాంకులు క్లోజ్ అని తెలుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంది.

గురు నానక్ జయంతి మరియు కార్తీక పూర్ణమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు. ఈ సెలవులను ఆర్‌బీఐ మంజూరు చేసింది. ఇక రేపు ఏయే చోట బ్యాంకులకు సెలవు అనేది చూస్తే హైదరాబాద్, ఐజ్వాల్, బెలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘర్, డెహ్రడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచి, షిమ్లా, శ్రీనగర్ లో రేపు బ్యాంకులు పని చేయవు.

బెంగళూరు, ఇంఫాల్ లో అయితే బ్యాంకులు నేడే సెలవు. ఆర్‌బీఐ ఈ విషయాన్ని చెప్పింది. త్రిపుర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు, సిక్కిం, అస్సాం, మణిపూర్, కేరళ, గోవా, బిహార్, మేఘాలయ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఏమి లేదు. బ్యాంక్ లో మనకి ముఖ్యమైన పనులు ఉంటే ముందే చేసేసుకోండి లేదంటే మరో రోజుకి వాయిదా వేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version