ప్రస్తుతం ఉన్నది మొత్తం వాట్సాప్ (whatsapp) ప్రపంచమనే చెప్పొచ్చు. అయితే ఈ టెక్నాలజీలో అసలు మనం చేసుకునే చాట్ భద్రంగా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కాగా తాజా అధ్యయనంలో వినియోగదారుల భద్రత మరియు గోప్యతకు పెద్ద ముప్పు ఉందని తెలుస్తోంది. నిజానికి వాట్సప్ లో ఒక పెద్ద లోపం ఉందట. ఈ లోపంతో సైబర్ నేరస్థులు ఎవరైనా వినియోగదారు చాట్ ను ఈజీగా చదవుకోవచ్చట. అయితే వాట్సప్ యొక్క చాట్ లు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్ట్ చేయబడ్డమాట నిజమేనట.
కాగా ఐక్లౌడ్ లేదా గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ నిల్వ చేసిన తరువాత గానీ ఆ చాట్ పూర్తిగా సురక్షితమైనవిగా పరిగణించలేమంట. హ్యాకర్లు ఐక్లౌడ్ లేదా గూగుల్ డ్రైవ్ లో సేవ్ వాట్సప్ చాట్ లను కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయగలరని తెలుస్తోంది. యాపిల్ లేదా గూగుల్ తమ వినియోగదారుల భద్రత కోసం అవసరమైన ఏర్పాట్లు చేశాయి కానీ అవి వినియోగదారుల చాట్ లకు ఎక్కువగా సురక్షితమైనవి కావని తెలుస్తోంది.
డబ్ల్యూ ఎబెటాఇన్ఫో నివేదిక ప్రకారం.. వాట్సప్ ఇప్పుడు క్లౌడ్ లో సేవ్ చేయడానికి ముందు చాట్ లను ఎన్ క్రిప్ట్ చేసే ఫీచర్ పై పనిచేస్తోందని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం వాట్సప్ ఈ కొత్త ఫీచర్ ను ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ డ్ బ్యాకప్ లు అని పిలుస్తారు. వాట్సప్ చాట్ లు మరియు మీడియాను ఎన్ క్రిప్ట్ చేయడానికి మీరు పాస్ వర్డ్ ని సెట్ చేయాల్సి ఉంటుంది. చాట్ ల బ్యాకప్ ని పునరుద్ధరించడానికి ఈ పాస్ వర్డ్ అవసరం అవుతుంది. అది లేకుండా మీరు మీ చాట్ హిస్టరీని పునరుద్ధరించలేరు. ఈ పాస్ వర్డ్ ప్రైవేట్ మరియు వాట్సప్, గూగుల్, ఫేస్ బుక్ లేదా యాపిల్ తో పంచుకోబడదు.