22 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ క‌లుస్తున్నారు!

-

ఐశ్య‌ర్యారాయ్‌, త‌మిళ హీరో ప్ర‌శాంత్ 22ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌బోతున్నారు. 1998లో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `జీన్స్‌`. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ్యాడ్మింట‌న్ స్టార్ అశోక్ అమృత్‌రాజ్‌, సునంద ముర‌ళీమ‌నోహ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మిళ, తెలుగు భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ ప్ర‌శాంత్, ఐశ్వ‌ర్యారాయ్ క‌లిసి న‌టించలేదు.

మ‌ళ్లీ ఇన్నేళ్లకు ఈరిద్ద‌రు క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం `అంధాధూన్‌`. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ప‌లు అవార్డుల్ని తెచ్చిపెట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ట‌బు పాత్ర‌ని త‌మ‌న్నా చేత చేయిస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది.

ఇదే చిత్రాన్ని ప్ర‌శాంత్ త‌మిళంలో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ట‌బు పాత్ర‌ని ఐశ్వ‌ర్యారాయ్ చేయ‌నుంద‌ని తెలిసింది. `జీన్స్‌` నుంచి ప్ర‌శాంత్‌తో ఐశ్వ‌ర్యారాయ్‌కి ఫ్రెండ్‌షిప్ ఏర్ప‌డింద‌ట‌. దాని వ‌ల్లే ప్ర‌శాంత్ అడ‌గ‌డంతో వెంట‌నే ఐశ్వ‌ర్యారాయ్ ట‌బు పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించింద‌ని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version