భారత్ ను టార్గెట్ చేసిన ఇస్లామిక్ స్టేట్: ఏమందో చూడండి…!

-

హింసా కాండతో భారత్ ని మరోసారి టార్గెట్ చేయాలని భావిస్తుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. ఐసిస్ తన ఆన్‌లైన్ పత్రికలో ద్వేషం, కుట్ర మరియు హింస కథనాలను ప్రచురించింది. వాయిస్ ఆఫ్ హింద్ అనే ఈ ఆన్‌లైన్ పత్రికలో భారతీయ ముస్లింలను మోసగించే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. బాబ్రీ కూల్చివేత నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ… భారత కోర్టు తీర్పుని మీరు అంగీకరించారా అని నిలదీసింది.Isis starting to reassert itself in Middle East heartlands, UN warns |  World news | The Guardian

భారతీయ ముస్లింలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. వారు ఆయుధాలు తీసుకోవాలని కోరింది. ఈ పత్రికలో, బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలి అని భారతీయ ముస్లింలను ప్రేరేపిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు రహస్య టెలిగ్రామ్ చానెల్స్ ద్వారా మరియు డార్క్ వెబ్ ద్వారా భారత్ లో వ్యాప్తి చేస్తున్నారు. ఈ పత్రికలో బాబ్రీ కూల్చివేతకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. బాబ్రీకి ప్రతీకారం తీర్చుకుంటామని రాశారు. భారతదేశంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఐసిస్ గట్టిగా నిలబడిందని ఈ పత్రిక పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news