చీరలో చితక్కొట్టిన ఇస్మార్ట్ బ్యూటీ..

-

పూరీ జగన్నాథ్ ని సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరింత ఎనర్జీతో కనిపిస్తూ అదరగొట్టాడు. ఈ సినిమాతో రామ్ మాస్ జనాలకి బాగా దగ్గరయ్యాడు. ఒక్క రామ్ కే కాదు ఈ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. హీరోయిన్లుగా చేసిన నభా నటేష్, నిధి అగర్వాల్ కి మంచి పేరొచ్చింది. వీరిద్దరూ అంతకుముందు సినిమాలు చేసినప్పటికీ ఇస్మార్ట్ సినిమాతోనే బ్రేక్ లభించింది.

అప్పటి నుండి జనాల్లో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఐతే తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మరీ గ్లామరస్ గా కనిపించి కుర్రకారు మతి పోగొట్టిన అమ్మడు చీరలో తళుక్కుమంది. గులాబీ రంగు చీరలో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తున్న ఈ భామకి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news