నోరు జార‌డం కాదు…కొంచెం వాడు!

-

పూరి జ‌గ‌న్నాధ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ నాదేంనంటూ ఆనందం హీరో ఆకాశ్ మూడు రోజుల క్రితం మీడియాకి ఎక్కిన సంగ‌తి తెలిసిందే. తగిన న్యాయం జ‌ర‌గ‌లని లేక‌పోతే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని పూరి టీమ్ ని హెచ్చ‌రించాడు. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడ‌టంతో ఆకాశ్ నిజంగానే పూరి అంత గొప్ప సినిమా తీసాడా? అని మీడియాలో సైతం క‌థ‌నాలు వ‌చ్చాయి. నెగిటివ్ ప్ర‌చారం అంతే జోరుగా జ‌రిగింది. అయితే ఒక‌ప్ప‌టి స్టార్ హీరో కాబ‌ట్టి మీడియా సింప‌తీ చూపించింది. కానీ తాజాగా ఆసినిమా `కొత్త‌గా ఉన్నాడు` ట్రైల‌ర్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసాడు. ట్రైల‌ర్ తో సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోయింది. సినిమా ఎంత నాసిర‌కంగా ఉంటుందో ట్రైల‌ర్ చూస్తే ఓక్లారిటీ వ‌చ్చేసింది.

క‌థ ప‌రంగా మొద‌డులో మెమోరీ పాయింట్ త‌ప్ప ఇంకేపాయింట్ ఇస్మార్ట్ శంక‌ర్ తో సంబంధం లేదు. యాక్టింగ్ చేత‌కాక ఆకాష్, హీరోయిన్ ఎవ‌రో తెలియ‌క ట్రైల‌ర్ చూసిన‌ ఆడియ‌న్స్ చాలా ఇబ్బందికి గుర‌వుతున్న‌ట్లు కామెంట్లు పెడుతున్నారు. ట్రైల‌ర్ ఎడిటింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పెళ్లి వీడియోలు ఎడిట్ చేసే వాడిని తీసుకొచ్చి సినిమాకు ఎడిటింగ్ చేయించిన‌ట్లు ఉంది. పెళ్లి వీడియోల మిక్సింగ్ ఎడిట‌ర్ తో కూడా కొత్తగా ఉన్నాడు సినిమా ఎడిట‌ర్ పోల్చ‌డం చాలా ఎక్కువ‌. కెమెరా ప‌నిత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా ఈ ట్రైల‌ర్ చూసిన నేటి జ‌నులు, పూరి అభిమానులు ఆకాశ్ మీద తిట్ల దాడి చేస్తున్నారు. పూరి సినిమాతో నీ సినిమా పోలికా? న రు జారే ముందు కొంచె వాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పూరి గ‌నుక నీ సినిమా చూస్తే ప్రేస్టేష‌న్ లో ఏదైనా చేసుకున్నా చేసుకుంటాడు. దయ‌చేసి ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు మాత్రం ఆయ‌న‌కు తెలియ‌కుండా చూడు. లేదంటే నీ సంగ‌తి మేము చూస్తామంటూ హెచ్చ‌రించారు. ఇంకొంద‌రు పూరి నుంచి డ‌బ్బులు గుంజాల‌నే ఇలా ర‌చ్చే చేసి ఉండొచ్చని, లేక‌పోతే ఆ సినిమా ప్ర‌చారం కోసం ఇస్మార్ట్ శంక‌ర్ పేరు వాడాడ‌ని మండిప‌డుతున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ క‌ళాఖండం విడుద‌ల కానుంది. ఆడియ‌న్స్ కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండ‌ని నేటి జ‌నులు సూచించారు. మ‌రి వీటిపై ఆకాశ్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version