తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో మహిళా బాధితురాలు కాంప్రమైజ్ అయినట్లు సమాచారం అందుతుంది. హైకోర్టు వరకు కేసు వెళ్లడంతో… అక్కడ ఆదిమూలం తో బాధిత మహిళ రాజీ పడ్డారట. ఈ తరుణంలోనే… ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టి వేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా… మహిళ కార్యకర్తపై లైంగిక దాడి చేసిన కేసులో.. ఎమ్మెల్యే ఆదిమూలంపై గత నెలలో కేసు నమోదు అయింది. దింతో తెలుగుదేశం పార్టీ నుంచి ఆదిమూలంను బహిష్కరించారు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అనంతరం ఆయన రాజీనామా చేస్తారని కూడా ఆ వార్తలు వచ్చాయి. కానీ ఇంతలో ఈ కేసు కాంప్రమైజ్ కు వచ్చినట్లు సమాచారం.