గత కొంతకాలంగా హమాస్ మరియు ఇజ్రాయెల్ కు మధ్యన యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు వైపులా వేల మంది ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా కొన్ని రోజుల పాటు అంగీకారంగా ప్రకారం యుద్దాన్ని ఆపివేశారు. ఈ విషయంపై తాజాగా ఇజ్రాయెల్ దేశానికి చెందిన రక్షణ శాఖా మంత్రి యౌ గల్లంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యుద్ధం ఆగిపోలేదు ఇది బ్రేక్ మాత్రమే… హమాస్ దగ్గర ఉన్న మా పౌరులను తీసుకురావడానికి ఇప్పుడు యుద్దాన్ని అపాయము అంతే. మాకు దొరికిన ఈ తక్కువ విరామంలో మరికొన్ని ఆయుధాలను సమకూర్చుకుని మళ్ళీ భీకరమైన యుద్దానికి సిద్ధంగా ఉంటామనతూ మంత్రి తెలియచేశాడు. హమాస్ మీద విజయం సాధించే వరకు ఈ యుద్దాన్ని ఆపబోము అంటూ గల్లంట్ స్పష్టం చేశాడు.
మరి ఈ వ్యాఖ్యలపై హమాస్ ఏమైనా స్పందిస్తుందా ? లేదా మేము కూడా ఇదే ప్లాన్ లోనే ఉన్నామంటూ లోలోపల అనుకుని యుద్ధం సమయానికి అంతకు మించి అన్నట్లు దాడి చేస్తుందా చూడాలి.