కృత్రిమ వీర్యాన్ని కనుగొన్న ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు !

-

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఇజ్రాయెల్ పరిశోధకులు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్ వంటివి మగవారిలో వీర్యాన్ని తయారు చేసే కణాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో మున్ముందు సంతానం కలగడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇక చిన్నప్పుడే క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న వారికి ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి బెన్ -గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగెవ్ నేతృత్వంలో పరిశోధకులు వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు.

అతి సూక్ష్మమైన ద్రవ్య వ్యవస్థ ద్వారా ప్రయోగశాలలో వీర్యాన్ని ఉత్పత్తి చేయడం దీని ఉద్దేశం. ఈ ద్రవ్య వ్యవస్థలో వేలాది అతి సన్నటి మార్గాలు ఉంటాయి. ఇంకా వీర్యం ఉత్పత్తి కాని ఎలుక వృషనాల నుంచి తీసిన కణాలను ప్రత్యేకమైన సిలికాన్ చిప్ మీద ఉంచి.. ద్రవ్య వ్యవస్థ ద్వారా అవసరమైన పోషకాలను పదార్థాలను సరఫరా చేశారు. క్రమంగా అవి వీర్యాంగా వృద్ధి చెందడం గమనార్హం. కాగా ముందు ముందు వీటితో శుక్రకణాలను తయారు చేయవచ్చా? అనేదానిపై పరిశోధకులు దృష్టి సారించారు.

వీర్యం ఉత్పత్తి కి తోడ్పడే కణాలు అభివృద్ధి కానీ ఎలుకల వృషణాల నుంచి తీసిన కణజాలంతో పరిశోధన చేశారు. ప్రయోగశాలలో సహజ పరిస్థితులను పోలిన వాతావరణంలో అవసరమైన పోషకాలను, వృద్ధి కారకాలను అందిస్తే వృషణాల కణాలను శుక్రకణాలు గా మార్చే అవకాశం ఉందని నిరూపించారు.అందుకే ఈ ప్రయోగాన్ని ‘టెస్టింగ్ ఆన్ చిప్’ గా పిలుచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version