గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 45 మంది దుర్మరణం

-

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం కారణంగా నానాటికీ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి.హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. ఈ ఘటనలో సుమారు 45 మంది దుర్మరణం పాలైనట్లు సమాచారం. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో 6 భవనాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేశాయి.

ఈ దాడుల్లో 35 మంది మరణించారు.ఓ ఇంటిపై జరిగిన మరో దాడిలో 10 మంది మృతి చెందగా..అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.ఇకపోతే, ఇజ్రాయెల్ దాడులపై కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ (CAIR) స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది.కాగా, దాడులు జరిపింది తామేనని ఐడీఎఫ్‌ ధ్రువీకరించింది. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ లక్ష్యంగా ఈ దాడులు చెసినట్లు తెలిపింది. కాగా, ఈ దాడులను జోర్డాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.‘ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనే. అమాయక పౌరుల లక్ష్యంగా దాడులు చేయడం దారుణం’ అని ఎక్స్‌ వేదికగా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news