నిమ్మచెక్కతో ప్రయోజనాలు ఎన్నో తెలుసా..అసలు వేస్ట్ చేయకండి.!

-

మార్కెట్ కు వెళ్లిన ప్రతిసారి లాస్ట్ లో నిమ్మకాయలను కొనటం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఎన్నో వంటల్లో ఉపయోగపడతాయి..ఇంకా బ్యూటీ టిప్స్ లో కూడా..కొన్ని చుక్కలు వేస్తుంటారు. ఒక్కోసారి పులిహోర చేసినప్పుడు ఎక్కువ నిమ్మకాయలు అవసరం అవుతాయి..అలాగే కొందురు గృహిణులు..నిమ్మకాయలు ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా రసం ఎండిపోతుంది..అన్నీ ఒకేసారి పిండుకుని రసాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తుంటారు. అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఇలా చేయడం మంచి పద్దితే..అలా ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలను పిండుకున్నప్పుడు తొక్కలను మనం సాధారణంగా డస్ట్ బిన్ లో వేసేస్తుంటాం..కానీ నిమ్మచెక్కతో కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా..!

Lemon: తళతళలాడించే నిమ్మ తొక్కలు | benifits-of-lenmon-after-crushing

బీట్‌రూట్, స్ట్రాబెర్రీ, నేరేడు వంటి పండ్లను కట్‌ చేస్తున్నప్పుడు చేతులు రంగు మారుతుంటాయి. ఆ మరకలు పోవాలంటే నిమ్మచెక్కతో రుద్దుకుంటే సరిపోతుంది.

జిడ్డుగా మారిన వంటింటి సింకును నిమ్మచెక్కతో రుద్ది శుభ్రం చేసుకోవచ్చు.

చెమట వల్ల బూట్లు దుర్వాసన వస్తుంటాయి. ప్రతిసారీ బూట్లను కడగలేం. అలాంటప్పుడు ఎండబెట్టిన నిమ్మచెక్కలని బూట్లలో వేసి ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటాయి.

తువాళ్లకు పట్టిన మరకలు ఒక పట్టాన పోవు.. ఇలాంటప్పుడు నిమ్మతొక్కలు, వంటసోడా వేసిన నీటిలో వాటిని నానబెట్టి ఉతికితే చక్కగా తెల్లబడతాయి.

వాడేసిన నిమ్మచెక్కలని ఉప్పులో ముంచి వాటితో కాయగూరలు కట్ చేసే బోర్డుని రుద్దితే మరకలు లేకుండా మారుతుంది.

నిమ్మతొక్కలతో ఎన్ని ఉపయోగాలో...

వెనిగర్‌లో నిమ్మతొక్కలను వేసి రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజున కాసిన్ని నీళ్లు కలిపి ఓ సీసాలో తీసుకోవాలి. దీంతో అద్దాలు, స్నానాల గదుల గోడలు శుభ్రం చేసుకోవచ్చు.

వేడినీళ్లలో నిమ్మతొక్కలు వేసి..కాస్త చల్లారక కాల్లు పెడితే కాళ్లలో ఉండే దుమ్మూధూళి అంతా పోయి..కాళ్లు పగుళ్లు తగ్గుతాయి. అందంగా మారుతాయి.

కత్తిపిడి, బొమ్మలు వంటివి పసుపు రంగుకి మారితే నిమ్మతొక్కలతో రుద్దాలి.

నిమ్మతొక్కలను నీటిలో కలుపుకుని స్నానం చేస్తే శరీరం కాంతివంతంగా ఉంటుంది. గజ్జి,తామర వంటి చర్మవ్యాధులు రావు.

అడుగంటిన పాత్రల్లో నిమ్మతొక్కలని చిన్నచిన్న ముక్కలుగా చేసి.. వేసి నీరుపోసి మరిగించాలి. చల్లారాక శుభ్రంగా కడిగితే మరకలు పోతాయి.

రాగి వస్తువులను నిమ్మచెక్కలతో శుభ్రపరచుకోవచ్చు. ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో వాటిని రుద్ది, నీటితో కడిగి తర్వాత పొడిబట్టలతో తుడవాలి.

చేతి గోళ్లను నిమ్మతొక్కలతో బాగా రుద్దితే,గోళ్లు అందంగా మారుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news