అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై కేంద్రం మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో అంతరిక్ష పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. 2030 నాటికి భారత దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రకటించారు. ఇస్రో భవిష్యత్ ప్రాజెక్ట్ లకు సంబంధించి ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దేశ అంతరిక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, స్వదేశీ స్టార్టప్‌లపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ మేరకు పలు అంశాలను వెల్లడించారు.