చంద్రయాన్-2 ను గత కొద్ది రోజుల కిందట ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే చంద్రయాన్-2 తీసిన భూమి ఫొటోలను ఇస్రో గత కొంత సేపటి క్రితమే విడుదల చేసింది.
గత వారం రోజుల కిందట చంద్రయాన్-2 తీసిన ఫొటోలంటూ.. కొందరు కొన్ని ఫొటోలను వైరల్ చేశారు. ఓ దశలో ఆ ఫొటోలను చాలా మంది నిజమే అని నమ్మారు. అయితే ఇస్రో చంద్రయాన్-2 కు చెందిన ఎలాంటి ఫొటోలను పోస్ట్ చేయలేదని ఆ తరువాత తెలిసింది. దీంతో ఆ ఫొటోలు నకిలీ ఫొటోలని తేల్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఇస్రో నిజంగానే చంద్రయాన్-2 తీసిన ఫొటోలను పోస్ట్ చేసింది.
చంద్రయాన్-2 ను గత కొద్ది రోజుల కిందట ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే చంద్రయాన్-2 తీసిన భూమి ఫొటోలను ఇస్రో గత కొంత సేపటి క్రితమే విడుదల చేసింది. ఈ మేరకు ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోలను పోస్ట్ చేసింది. కాగా చంద్రయాన్-2 నుంచి రోవర్ విడిపోయి సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై దిగనుంది. అనంతరం అక్కడి ఉపరితలంపై ఉండే మట్టి, ఇతర నమూనాలను రోవర్ సేకరించి విశ్లేషించి ఆ వివరాలను చంద్రయాన్-2 ద్వారా మనకు పంపుతుంది.
#ISRO
First set of beautiful images of the Earth captured by #Chandrayaan2 #VikramLander
Earth as viewed by #Chandrayaan2 LI4 Camera on August 3, 2019 17:28 UT pic.twitter.com/pLIgHHfg8I— ISRO (@isro) August 4, 2019
#ISRO
Earth as viewed by #Chandrayaan2 LI4 Camera on August 3, 2019 17:37 UT pic.twitter.com/8N7c8CROjy— ISRO (@isro) August 4, 2019
#ISRO
Earth as viewed by #Chandrayaan2 LI4 Camera on August 3, 2019 17:34 UT pic.twitter.com/1XKiFCsOsR— ISRO (@isro) August 4, 2019
#ISRO
Earth as viewed by #Chandrayaan2 LI4 Camera on August 3, 2019 17:32 UT pic.twitter.com/KyqdCh5UHa— ISRO (@isro) August 4, 2019