నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ-సీ 52

-

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో చేప‌ట్టిన ప్ర‌యోగ వాహ‌క నౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ 52 కొద్ది సేప‌టి క్రిత‌మే నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీ‌హ‌రికోటలోని స‌తీశ్ ధ‌వ‌న్ అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం వేదిక‌గా వెళ్లింది. ఆదివారం ఉద‌యం కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. 25.30 గంట‌ల కౌంట్‌డౌన్ అనంత‌రం ఇవాళ ఉద‌యం 6 గంట‌ల‌కు వాహ‌క‌నౌక ఆర్ఐశాట్‌-1 ఐఎన్ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్-1 ఉప‌గ్ర‌హాల‌ను నింగిలోకి మోసుకెళ్లుతుంది. 18.31 నిమిషాల త‌రువాత ఈ మూడు ఉపగ్ర‌హాల‌ను రాకెట్ క‌క్ష‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇస్రోకు 2022లో ఇదే తొలి ప్ర‌యోగం. , ఇస్రో అధిప‌తిగా నియ‌మితులైన సోమ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టే మొద‌టి ప్ర‌యోగం ఇదే కావ‌డం విశేషం.

ఆర్ఐశాట్‌-1

ఈ ఉప‌గ్ర‌హం ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీని కాల‌ప‌రిమితి ప‌దేళ్లు. రేయింబ‌వ‌ళ్లు అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో ప‌ని చేసేలా రూపొందించారు. ఉప‌గ్ర‌హంలో అధిక డేటా నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌లు, అధిక నిల్వ ప‌రికరాలున్నాయి వ్య‌వ‌సాయం, అట‌వీ, నీటి వ‌న‌రుల నిర్వ‌హ‌ణ కోసం విలువైన స‌మాచారం క‌నుగొనేందుకు ఉప‌గ్ర‌హం ఇమేజింగ్ డేటా ఉపయోగ‌ప‌డుతుంది.

ఐఎస్ఎస్‌-2టీడీ

భార‌త్‌, భూటాన్ క‌లిసి రూపొందించిన ఈ ఉప‌గ్ర‌హ జీవిత కాలం ఆరు నెల‌లు. భ‌విష్య‌త్ సైన్స్‌, ప్ర‌యోగాత్మ‌క పేలోడ్స్ కోసం రూపొందించారు.

ఇన్‌స్పైర్‌శాట్-1

విశ్వ‌విద్యాల‌యాల విద్యార్థులు త‌యారు చేసిన ఈ ఉప‌గ్ర‌హం బ‌రువు 8.1 కిలోలు. జీవిత కాలం ఏడాది. త‌క్కువ భూకక్ష‌లో ఉండే ఈ ఉప‌గ్ర‌హంలో భూమి అయానోస్పియ‌ర్ అధ్య‌య‌నం నిమిత్తం కాంపాక్ట్ అయానోస్పియ‌ర్ ప్రోబ్ అమ‌ర్చి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version