నేటితో ముగియ‌నున్న స‌హ‌స్త్రాబ్ది వేడుకులు.. సీఎం కేసీఆర్ హాజ‌రు

-

హైద‌రాబాద్ పక్క‌న ఉన్న ముచ్చింతల్ ప్రాంతంలో స‌మ‌తా మూర్తి రామానుజాచార్యుల విగ్ర‌హాం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అక్క‌డ స‌మ‌తా మూర్తి వెయ్యి ఏళ్ల ఉత్స‌వాల‌ను జ‌రుపుతున్నారు. ఈ స‌హస్త్రాబ్ది వేడుకులు నేటితో ముగియ‌నున్నాయి. ఈ నెల 2 వ తేదీ నుంచి ప్రారంభం అయిన స‌మ‌తా మూర్తి స‌హ‌స్త్రాబ్ది వేడుక‌లు.. 12 రోజుల పాటు కొన‌సాగాయి. నేడు చివ‌రి రోజు కావ‌డంతో స‌మ‌తా మూర్తి కేంద్రంలో ప్ర‌త్యేక పూజు చేయ‌నున్నారు.

అలాగే నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. ఈ రోజు ఉద‌యం 9:30 గంట‌ల‌కు స‌హ‌స్ర కుండ‌లాల యజ్ఞానికి మ‌హా పూర్ణ‌హుతి ప‌లుక‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ రానున్న‌ట్టు తెలుస్తుంది. అనంతరం 11:30 గంట‌ల‌కు రామానుజాచార్యుల బంగారు విగ్రాహానికి ప్రాణ ప్ర‌తిష్టాప‌న చేస్తారు. అలాగే సాయంత్రం 5 గంట‌లకు 108 ఆల‌యాల్లో క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. కాగ నిన్న స‌మ‌తా మూర్తి కేంద్రంలో రాష్ట్రప‌తి రామ్ నాథ్ కొవింద్ హాజ‌రు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version