కవిత కూడా జై తెలంగాణ అనడం సిగ్గు చేటు: మధుయాష్కీ గౌడ్

-

అవినీతికి పాల్పడ్డోళ్లు ‘జై తెలంగాణ’ అనడానికి అనర్హులు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవిత కూడా జై తెలంగాణ అనడం సిగ్గు చేటన్నారు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్.ఆదివారం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ …10 సంవత్సరాలలో బీఆర్ఎస్ దుర్మార్గపు పాలనను అమలు చేసిందని మండిపడ్డారు. మలి దశ తొలి అమరవీరుడు శ్రీకాంత చారి తల్లికి కూడా కనీసం గుర్తింపు ఇవ్వలేదని ,కేసీఆర్ అండ్ టీమ్ రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతిన్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, కేసీఆర్ మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేశాడని మధుయాష్కీ గౌడ్ అన్నారు.అవకాశం ఉన్న ప్రతీ చోట గడిచిన పదేళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news