మధ్యాహ్నం ఫుడ్ డెలివరీలకు తాత్కాలిక విరామం ప్రకటించాలి… జోమాటో విజ్ఞప్తి

-

డెలివరీ బాయ్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్నారు.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా కస్టమర్లకు జోమటో విజ్ఞప్తి చేసింది.

దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనేక మందికి ఈ విజ్ఞప్తి కాస్త వింతగా అనిపించింది. ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్లు, వృద్ధుల పరిస్థితి ఏమిటని కొందరు ,ఆకలేస్తేనే ఆర్డర్ పెడతాం కదా అని మరికొందరు ప్రశ్నించారు. మధ్యాహ్నం వేళల్లో ఫుడ్ డెలివరీలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని మరికొందరు సూచించారు. మరోవైపు ఢిల్లీలో ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. నేడు ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news