దేశాన్ని విభజించి పాలించాలనేది కాంగ్రెస్ కుట్ర: మోదీ

-

భారతీయుల పట్ల కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారు అని మండిపడ్డారు.దేశాన్ని విభజించి పాలించాలనేది కాంగ్రెస్ కుట్ర. శ్రీరామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు వారు మాట్లాడుతున్నారు. రాముడిని పూజించడం దేశద్రోహమా? బుద్ధం శరణం గచ్చామి ఇండియా సిద్ధాంతం. అహింసో పరమోధర్మో అనేది భారత్ సిద్ధాంతం’ అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

తెలంగాణలో కొత్తగా RRR టాక్స్ కూడా మొదలైందని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘RR టాక్స్ విషయంలో నేను ఎవరి పేరు చెప్పలేదు. కానీ ఇక్కడి ముఖ్యమంత్రి దీనిపై భుజాలు తడుముకున్నారు. RRR టాక్స్లో 3వ ఆర్ అంటే రజాకార్ టాక్స్ అని అర్థం. మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదనేది బీజేపీ సిద్ధాంతం. ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని మాత్రమే బీజేపీ చెప్పింది. దానికి కట్టుబడి ఉన్నాం’ అని మోడీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news