అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ని అరికట్టడానికి సరైన ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో చాలా రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు పనులన్నీ ఆగిపోవడంతో తమ స్వస్థలాలకు వెళ్లడానికి డబ్బులు మరియు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీ ప్రాంతాలలో భారీగా జనం గుమిగూడి పోయారు. వేలాది మంది వలస కార్మికులు బస్సు టెర్మినల్స్ కు చేరుకున్నారు. ఇళ్లకు వెళ్లడానికి చేసే ప్రయత్నంలో ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో వారు గుమికూడారు.
అయితే వలస కూలీల విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అని మరో పక్క డిమాండ్ వినబడుతుంది. ఇదే కనుక దేశవ్యాప్తంగా ఇంకా ఈ విధంగానే జరిగి కరోనా వైరస్ ని మించిన డేంజర్ ఇది అని…దేశానికి పెను ప్రమాదం అవుతుంది అని చాలా మంది ప్రాణాలు కోల్పోవడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో అంటున్నారు. ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షట్ డౌన్ విషయంలో…వలస కూలీల ను కూడా ఆదుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.